Srinidhi Shetty: తల్లిని కోల్పోయిన బాధలో డిప్రెషన్ లోకి వెళ్లా
కెజిఎఫ్(KGF) సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Sri Nidhi Shetty). క్రేజ్ అయితే వచ్చింది కానీ ఆ సినిమాతో హీరోయిన్ కు స్టార్డమ్ మాత్రం రాలేదు. రీసెంట్ గా నాని(Nani) హీరోగా నటించిన హిట్3(Hit3) సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆ సినిమాతో మంచి హిట్ అందుకుని స్టార్డమ్ ను కూడా సంపాదించుకుంది.
హిట్3 ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. తన జర్నీలో ఎన్నో బాధలను దిగమింగి ఇవాళ ఈ స్థాయికి వచ్చానని చెప్తున్న శ్రీనిధి, తాను పదో తరగతి చదువుతున్నప్పుడే తల్లిని కోల్పోయానని ఆ షాక్ ను తట్టుకోలేక కొన్నాళ్ల పాటూ డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పింది.
గతాన్ని మర్చిపోయేందుకు బెంగుళూరుకు వెళ్లిందట. అయినా తల్లిని మర్చిపోలేకపోయిన శ్రీనిధి, చాలా రోజుల పాటూ ఆమెను తలచుకుంటూ ఏడ్చినట్టు చెప్పుకొచ్చింది. ఆ ఘటన నుంచి తేరుకోవడానికి చాలానే టైమ్ పట్టిందని చెప్పిన శ్రీనిధి తల్లి చనిపోయాక తండ్రి తనకెంతో సపోర్ట్ గా నిలిచారని, తండ్రితో ఉన్న ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తానని వెల్లడించింది.






