Rukmini Vasanth: ఆ నెంబర్ తో నాకు సంబంధం లేదు
కాంతార చాప్టర్1(kanthara chapter1) సినిమాతో దేశవ్యాప్తంగా భారీ గుర్తింపును తెచ్చుకుంది రుక్మిణి వసంత్(Rukmini vasanth). రీసెంట్ గా తన పేరుతో జరుగుతున్న ఓ మోసాన్ని అందరికీ వెల్లడిస్తూ జనాన్ని అప్రమత్తం చేసింది రుక్మిణి. ఓ గుర్తు తెలియని వ్యక్తి తన పేరుని వాడుకుని కొంతమందిని సంప్రదిస్తున్నాడని, వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని రుక్మిణి సోషల్ మీడియా వేదికగా అందరికీ సూచించింది.
9445893273 అనే నెంబర్ ను వాడుతున్న వ్యక్తి, తన పేరు చెప్పుకుంటూ తప్పుడు ఉద్దేశాలతో పలువురిని సంప్రదిస్తున్నారనే వార్త తన దృష్టికి వచ్చిందని, తనకు, ఆ నెంబర్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆ నెంబర్ నుంచి వచ్చే కాల్స్, మోసేజ్‌లు అన్నీ ఫేకేనని, ఎవరూ వాటికి రియాక్ట్ అవొద్దని రుక్మిణి కోరింది. ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ వస్తే తనను లేదా తన టీమ్ ను సంప్రదించాలని రుక్మిణి చెప్పింది.
ఇలా ఒకరి పేరుని వాడుకుని వేరే వారిని సంప్రదించడం సైబర్ నేరమని, తన టీమ్ ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నట్టు రుక్మిణి చెప్పింది. ఇక రుక్మిణి కెరీర్ విషయానికొస్తే అమ్మడు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) తో ఓ సినిమా, విజయ్(Vijay sethupati)- మణిరత్నం(maniratnam) సినిమాతో పాటూ గీతూ మోహన్‌దాస్(geethu mohandas) దర్శకత్వంలో యష్(Yash) హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్(Toxic)లో నటిస్తోంది.
https://x.com/rukminitweets/status/1986738322153329095







