Manchu Vishnu: ఆ విషయం ఒప్పుకోవడానికి నాకెలాంటి ఈగో లేదు

మంచు విష్ణు(Manchu Vishnu) ఎన్నో ఏళ్లుగా కలలు కన్న తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప(kannappa) శుక్రవారం రిలీజై మంచి టాక్ తో బాక్సీఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. భక్తి నేపథ్యంలో తెరకెక్కడం, దానికి తోడు భారీ స్టార్ క్యాస్ట్ ఉండటం కన్నప్పకు బాగా కలిసొచ్చింది. కన్నప్ప సినిమాకు డే1 సుమారు రూ.16 కోట్లు గ్రాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విష్ణు కెరీర్లోనే కన్నప్ప కు వచ్చిన ఓపెనింగ్స్ హయ్యెస్ట్. కన్నప్పకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణం ప్రభాస్(prabhas) అనే సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని మంచు విష్ణు కూడా మీడియా ఎదురుగా ఒప్పుకుంటూ, కన్నప్ప ఈ స్థాయి సక్సెస్ అందుకోవడానికి కారణం తన బ్రదర్ ప్రభాసే కారణమని చెప్పడానికి తనకెలాంటి ఈగోలు లేవని చెప్పి ఓ మెట్టు ఎక్కేశాడు విష్ణు.
దాంతో పాటూ కన్నప్ప చూసి తన సొంత తమ్ముడు మనోజ్(Manchu Manoj) కూడా అన్న చాలా బాగా చేశాడనే విషయాన్ని విష్ణు ముందు ప్రస్తావించగా, దానికి సమాధానమిస్తూ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలని చెప్పాడు. మొత్తానికి కన్నప్ప సినిమా విష్ణు కెరీర్ ను ఓ కొత్త మలుపు తిప్పింది. కన్నప్ప మూవీతో మంచు విష్ణు మాత్రం నటుడిగా ఎన్నో మెట్లు పైకి ఎక్కాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.