Thaman: అనిరుధ్ కు వచ్చినట్టు నాకు ఛాన్సులు రావడం లేదు
తమన్(thaman) మ్యూజిక్ డైరెక్టర్ ఏదైనా సినిమా వస్తుందంటే స్పీకర్లు పగిలిపోవడం గ్యారెంటీ అని అందరికీ తెలిసిన విషయమే. ప్రతీ సినిమాకీ తనదైన మ్యూజిక్ ఇచ్చి దాంతో ఆడియన్స్ ను ఆకట్టుకునే తమన్, ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా కంటిన్యూ అవుతున్నాడు. తన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ తో వరుస ఛాన్సులు అందుకుంటున్న తమన్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అనిరుధ్(Anirudh) కు తెలుగులో మూవీస్ సులభంగా దొరుకుతున్నాయని, కానీ తనకు అలా తమిళంలో సినీ అవకాశాలు రావడం లేదని, తమిళంలో ఛాన్స్ దక్కించుకోవడం తనకు కష్టమవుతుందని, దానిక్కారణం కోలీవుడ్ లో ఉన్న ఐక్యతేనని, ఆ యూనిటీ టాలీవుడ్ లో మిస్ అయిందని తాను అనుకుంటున్నానని తమన్ చెప్పాడు. దీంతో ఆ మాటలు చర్చనీయాంశంగా మారాయి.
అయితే తమన్ చెప్పిన మాట్లలో ముమ్మాటికీ నిజముంది. అలా అని అనిరుధ్ కు ఛాన్సులు రావడాన్ని తమన్ తప్పుబట్టడం లేదు. కోలీవుడ్ లో ఉన్న యూనిటీ టాలీవుడ్ లో కూడా ఉండి ఉంటే తెలుగు వారికి ఎక్కువ అవకాశాలు దక్కుతాయనేదే ఆయన ఆవేదనగా కనిపిస్తుంది. అయితే అనిరుధ్ కు టాలీవుడ్ లో అవకాశాలు ఎక్కువగా రావడానికి అతనికున్న క్రేజ్ తో పాటూ అతని సంగీతమే అనే సంగతి కూడా తెలిసిందే.






