రామ్ చరణ్ ఆ బరువు మోయగలడా?
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) మార్కెట్ ను ఎంత విపరీతంగా పెంచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ విషయంలో ఇప్పటికే దేవర(Devara) సినిమా కలెక్షన్స్ దాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఏ మేర పెరిగిందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ఆచార్య(Acharya) సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఆ సినిమాలో చరణ్ చేసింది గెస్ట్ పాత్ర కావడంతో దాన్ని పరిగణనలోకి తీసుకునే పన్లేదు. కాబట్టి ఇప్పుడు చరణ్ తన తర్వాతి సినిమా అయిన గేమ్ ఛేంజర్(Game Changer) తో తన సత్తాను చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే గేమ్ ఛేంజర్ మూవీ చరణ్ కు మోయలేని భారమవుతుందేమోననే డౌట్ వ్యక్తమవుతుంది.
గేమ్ ఛేంజర్ అనుకున్న టైమ్ కు పూర్తై పోయి, రిలీజై ఉంటే రిజల్ట్ ఎలా ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు కానీ ఈ సినిమా మొదలై ఇప్పటికే నాలుగేళ్లవుతోంది. బడ్జెట్ కూడా భారీగా పెరిగి వడ్డీలు భారమైపోయాయి. సినిమా లేట్ అవడంతో దీనిపై హైప్ తగ్గిపోయింది. దానికి తోడు శంకర్(shankar) ఆఖరి సినిమా ఇండియన్2(Indian2) డిజాస్టర్ ఎఫెక్ట్, ఆచార్య ఎఫెక్ట్ కూడా గేమ్ ఛేంజర్ పై పడనున్నాయి. బడ్జెట్ భారీగా పెరగడంతో థియేట్రికల్ రైట్స్ ను ఎక్కువ రేట్లకు అమ్మాలని చూస్తుంటే బయ్యర్లు మాత్రం స్పందించడం లేదు. మరి ఇన్నింటిని తట్టుకుని గేమ్ ఛేంజర్ నిలబడగలదా? చరణ్ ఈ భారాన్ని మోయగలడా అనేది ప్రశ్నగా మారింది. గేమ్ ఛేంజర్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ఇది సాధ్యమవడం కష్టం.













