Dacoit: డెకాయిట్ కు భారీ పోటీ

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అడివి శేష్(Adivi Sesh) హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల్లో డెకాయిట్(Dacoit) కూడా ఒకటి. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఈ సినిమాలో అడివి శేష్ కు జోడీగా నటిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానియెల్ డియో(Shaneal Deo) డైరెక్టర్ గా మారి చేస్తున్న మొదటి సినిమా కావడంతో పాటూ ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు డెకాయిట్ పై అంచనాలను పెంచాయి.
శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా డెకాయిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ లో భారీ పోటీ ఉండేట్టుంది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aaryan), శ్రీలీల(Sree Leela) జంటగా అనురాగ్ బసు(Anurag Basu) దర్శకత్వంలో వస్తోన్న రొమాంటిక్ మూవీ కూడా అదే రోజున రానుంది.
దాంతో పాటూ ఆలియా భట్(Alia Bhat), శర్వారి(Sarvari) నటిస్తున్న ఆల్ఫా(Alpha) సినిమా కూడా డిసెంబర్ 25నే ప్రేక్షకుల ముందుకు రానుండటంతో బాలీవుడ్ లో డెకాయిట్ కు భారీ పోటీ తప్పేలా కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెకాయిట్ అనుకున్న డేట్‌కే వస్తుందా లేదా రిలీజ్ డేట్ లో ఏమైనా మార్పు ఉంటుందా అనేది తెలియాలంటే వేచి చూడాలి.