#BB3కి కి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా అమలాఫౌల్ ?
#BB3తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటి జతకట్టడం అభిమానుల్లో మరో సారి ఉత్సాహాన్ని నింపింది.గతం లో దర్శకుడు బి. గోపాల్ తర్వాత బాలకృష్ణను అంత కొత్తగా, విభిన్నంగా చూపించడంలో బోయపాటిని మించిన వారెవరూ ఉండరనేది ఇండస్ట్రీలో టాక్. ఆ క్రేజ్‌తోనే ఇప్పుడు బాలయ్య సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే బాలయ్య పక్కన హీరోయిన్లను, మిగతా ఆర్టిస్టులను సెట్ చేయడంలో బోయపాటి స్టైల్ వేరు అనే విషయాన్ని విభిన్నంగా చెప్పుకొంటారు. హీరో గా చేస్తున్న జగపతి బాబును లెజెండ్ చిత్రంతో విలన్ గా పరిచయం చేసారు. ప్రస్తుతం జగపతి బాబు ఫుల్ బిజీ స్టార్ గా కొనసాగుతున్నారు. డిఫరెంట్ రోల్స్ చేసే రాధికా ఆప్టేను, అలాంటి స్టాండర్ట్స్‌ను మెయింటెన్ చేయడానికి బోయపాటి తాజా చిత్రంలో కూడా హీరోయిన్ల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న చిత్రం షూటింగ్ దశలోనే ఉండగానే భారీ క్రేజ్ కనిపిస్తున్నది. ఒకే ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత కరోనావైరస్ పరిస్థితులు నెలకొనడంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. లాక్డౌన్ సడలింపల తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్దామని అనుకొన్నారు. కానీ పరిస్థితులు మరింత దిగజారడంతో షూటింగ్ చేయడానికి నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు.
ఇక బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని బోయపాటి శ్రీను డైలాగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. డైలాగ్స్‌తో కేక పెట్టించే విధంగానే టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమానుల్లో జోష్‌ను పెంచి ఉత్సాహాన్ని నింపింది. ఇక టీజర్ తర్వాత అభిమానుల్లో జోష్ నింపే వార్తను బోయపాటి అందించేందుకు సిద్ధమయ్యారు. హీరోయిన్ ఎంపికను పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. ఇటీవల బాలకృష్ణ సరసన నటించాలని బోయపాటి బృందం హీరోయిన్ గా అమలాపాల్‌ను సంప్రదించినట్టు తెలిసింది. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారని, ఆ చిత్రంలో నటించడానికి అభ్యంతరం ఏమీ లేదనే విషయాన్ని చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమెతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఒకసారి చర్చలు పూర్తయిన తర్వాత అధికారికంగా అమలాపాల్ పేరు వెల్లడిస్తారని తెలిసింది.
అమలాపాల్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మలయాళంలో అడుజీవితం అనే చిత్రంలో దర్శక, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం వివాదాస్పద కథాంశంతో రూపొందుతున్నది. ఈ చిత్రాన్ని మలయాళ దర్శకుడు బ్లెస్సీ రూపొందిస్తున్నారు. అలాగే తమిళ, మలయాళ వెర్షన్లో వస్తున్న హిందీ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్‌లో నటిస్తున్నారు. ఇక అమలాపాల్ హిందీ చిత్రంలో కూడా నటించేందుకు సిద్ధమవుతున్నారు. అలనాటి ప్రముఖ తార పర్వీన్ బాబీ జీవిత కథాంశంగా రూపొందే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ డైరెక్టర్‌గా వ్యవరిస్తున్నారు. త్వరలోనే పర్వీన్ బాబీ బయోపిక్కు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నది. కరోనావైరస్ పరిస్థితులు సద్దుమణిగితే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు..













