పవర్ స్టార్ సినిమాని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో పెట్టడం వలనే ఆర్జీవీ నష్టపోయాడు
దర్శక నిర్మాత ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా మీద ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ అయితే అతన్ని మీద పీకలదాకా కోపం తో ఊగిపోయారు. అయితే ఈ సినిమా పై ఆర్జీవీ గంపెడు ఆశలు పెట్టుకున్నాడు సుమారు అయిదారు కోట్ల వరకు రాబడి కలెక్షన్ వస్తుదని అంచనా వేసుకున్నాడు. కానీ ఆ ఆశలన్నీ తల్లకిందులైపోయాయి. అయినంత మాత్రాన్న అతి తక్కువ బడ్జెట్ తో తీసిన పవర్ స్టార్ సినిమా ఆర్జీవీకి నష్టం ఏమి లేదు. సుమారు కోటిన్నర వరకు రెవెన్యూ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆయన తలపడిన వివాదాల తలనొప్పితో పోల్చుకుంటే ఇది మరీ తక్కువే. ఈ సినిమాని మరో వేదిక మీద పెట్టివుంటే మరింతగా రెవెన్యూ వచ్చేది అతను చేసుకున్న పొరపాటు వల్ల నష్టం వచ్చింది. దీనంతటికీ కారణం, పవర్ స్టార్ సినిమాను పే ఫర్ వ్యూ కింద విడుదల చేయడానికి సొంత వెబ్ సైట్ కు రూపకల్పన చేసి, అందులో వుంచడమే అతను చేసిన తప్పు. నిజానికి ఈ సినిమా అండ్రాయిడ్ అప్లికేషన్. పెర్ ఫెక్ట్ ఫైర్ వాల్ సిస్టమ్ అంతా పెర్ఫెక్ట్ గా వున్నా శ్రేయాస్ ఇటి సంస్థలో విడుదల కావాల్సి వుంది.
కానీ జనసైనికులు, పవన్ అభిమానులు, మెగాభిమానుల మనోభావాలను దృష్టిలో వుంచుకుని, శ్రేయాస్ ఇటి సంస్థ ఈ సినిమాకు దూరంగా వుండి పరాన్నజీవి సినిమాకి సప్పోర్ట్ చేసింది. దాంతో ఆర్జీవీ స్వంతంగా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే పేరుతో వెబ్ సైట్ పెట్టి అందులో విడుదల చేసారు. కానీ ఇదే అవకాశం ఎదురు చూసే పైరసీ దారులు పెద్దగా టైమ్ తీసుకోకుండానే మొత్తం సినిమాను డౌన్ లోడ్ చేసేయగలిగారు. ఫస్ట్ ఫేస్ బుక్ లోకి వెళ్లిపోయింది. ఆ తరువాత ఏకంగా వాట్సాప్ లోకి వచ్చేసింది. ఇంకేం వుంది, ఫ్రీగా యూట్యూబ్ లో చూసినట్టు చూసేసారు ఇక వైట్ టికెట్ లేదు, బ్లాక్ టికెట్ లేదు. ఇదే కనుక డౌన్ లౌడ్ కు వీలు లేకుండా వుండి వుంటే ఆర్జీవీ అనుకున్న టార్గెట్ రీచ్ అయి వుండేవారు. మంచి లాభాలు కళ్ల చూసి వుండేవారు. ఇప్పుడు ఇంత వివాదాలు నడిచిన తరువాత కూడా జస్ట్ కోటిన్నరతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.













