Hombale Films: రేర్ ఫీట్ సాధించిన హోంబలే ఫిల్మ్స్
శాండిల్వుడ్ కు చెందిన హోంబలే ఫిల్మ్స్(hombale films) అనే బ్యానర్ ఇప్పుడు ఓ రేర్ ఫీట్ ను సాధించింది. కెజిఎఫ్ చాప్టర్1(KGF1) మూవీతో రికార్డులు సృష్టించిన ఈ నిర్మాణ సంస్థ ఆ తర్వాత సౌత్ సినిమాల్లోకి ఎంటరై వరుస హిట్లను అందుకుంది. కెజిఎఫ్2(KGF2), కాంతార(Kanthara), సలార్(salaar) లాంటి పాన్ ఇండియా హిట్లతో సక్సెస్ ను కంటిన్యూ చేస్తున్న ఈ సంస్థ రీసెంట్ గా మహావతార్ నరసింహ(mahavatar narasimha) మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది.
అంతేకాదు, గత ఏడేళ్లలో 5 భారీ బాక్సాఫీస్ హిట్స్ ను అందుకుని ఏ నిర్మాణ సంస్థా సాధించని రేర్ ఫీట్ ను సాధించింది. ఈ ఐదు సినిమాలూ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ కు మంచి లాభాలను అందించాయి. అయితే ఈ సినిమాలన్నింటికీ కన్నడ దర్శకులే దర్శకత్వం వహించడం కూడా మరో అరుదైన విషయం. ఈ ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.
సక్సెస్ రేటు పడిపోతున్న తరుణంలో హోంబలే మూవీస్ ఆడియన్స్ కు నచ్చే సినిమాలను తీస్తూ ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది. కేవలం క్రేజీ కాంబినేషన్ల పైనే ఆధారపడకుండా, ఆడియన్స్ అంచనాలకు అనుగుణంగా కంటెంట్ ఉండేలా చూసుకుంటూ హోంబలే ఫిల్మ్స్ చాలా సక్సెస్ఫుల్ బ్యానర్ గా ముందుకెళ్తుంది. త్వరలోనే ఈ బ్యానర్ నుంచి కాంతార చాప్టర్1(kanthara1) రాబోతుండగా ఈ సినిమా రూ.1000 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు.







