హరీష్ పై పెరిగిన ఒత్తిడి
మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ కు ముందు బాగా అటెన్షన్ తెచ్చుకోవాలని ట్రై చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్ కు అది రివర్స్ అవడంతో షాక్ తగిలింది. చెప్పుకోడానికి మిక్డ్స్ టాక్ అంటున్నారు కానీ బాక్సాఫీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. స్వయంగా నిర్మాతే ఈ సినిమా స్క్రిప్ట్ దశలోనే మిస్టేక్స్ జరిగాయని ఓపెన్ గా
ఒప్పుకున్నాడు.
ఇక అసలు విషయానికొస్తే ఇప్పుడు హరీష్ శంకర్ మీద భారీగానే ఒత్తిడి ఉంది. అందులో మొదటిది ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా కూడా రీమేక్నే. విజయ్ తేరి మూవీ పోలీసోడుగా తెలుగులో వచ్చింది కానీ థియేటర్లలో ఎక్కువమంది చూడలేదు. ఇప్పటికీ ఈ సినిమా ప్రైమ్ లో అందుబాటులో ఉంది. చాలా మంది చూశారు కూడా.
అయినా సరే హరీష్ ఈ సినిమా మాతృకను మాత్రమే తీసుకుని ఒరిజినల్ వెర్షన్ గుర్తురానంత గొప్పగా రీమేక్ చేస్తానని పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే మిస్టర్ బచ్చన్ కు కూడా హరీష్ ఈ మాటలే చెప్పాడు. దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ హీరీష్ పై సందేహపడుతున్నారు. షూటింగ్ కు ఎలాగూ టైముంది కాబట్టి మరోసారి స్క్రిప్ట్ ను చెక్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి హరీష్ ఫ్యాన్స్ మాట వింటాడా లేదా తన వర్క్ మీద తనకు నమ్మకముందుని బ్లైండ్ గా ముందుకెళ్తాడో చూడాలి.













