HHVM: వీరమల్లు పార్ట్2 టైటిల్ ఇదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara veeramallu). ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే హరి హర వీరమల్లుకు భారీ ఓపెనింగ్సే దక్కేలా కనిపిస్తోంది. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), ఏఎం జ్యోతికృష్ణ(AM Jyothi Krishna) దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే.
రెండు భాగాల్లో మొదటి భాగంగా హరి హర వీరమల్లు పార్ట్1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ టైటిల్ తో రాగా ఈ సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2 టైటిల్ ను మేకర్స్ రివీల్ చేశారు. హరి హర వీరమల్లు పార్ట్2 బ్యాటిల్ ఫీల్డ్(Hari hara veeramallu part2 Battlefield) పేరుతో ఈ సినిమా రానుంది. అయితే మొదటి పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్, తన డేట్స్ ను బట్టి మాత్రమే రెండో పార్ట్ ఉంటుందని పవన్ ఆల్రెడీ ప్రమోషన్స్ లో హింట్ ఇచ్చారు.
ఏదేమైనా వీరమల్లు సెకండ్ పార్ట్ టైటిల్ మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకునేలానే ఉంది. నిధి అగర్వాల్(Niddhi Agerwal) హీరోయిన్ గా నటించిన వీరమల్లు సినిమాలో బాబీ డియోల్(Bobby Deol) ఔరంగజేబు అనే పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి(MM Keeravani) సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, మెగా సూర్య ప్రొడక్షన్స్(Mega Surya Productions) బ్యానర్ లో ఏఎం రత్నం(AM Ratnam) ఈ సినిమాను నిర్మించారు.







