అఖిల్ అక్కినేని ‘హలో’ టీజర్ విడుదల
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘హలో’. ఈ చిత్రంలో కథానాయికగా డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర టీజర్ గురువారం విడుదలైంది. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ తో ‘ద లక్కీయెస్ట్ పీపుల్ బోర్న్ ఆన్ ఇన్ దిస్ ఎర్త్. వాళ్లు మాత్రం ఎవరేం చేసినా, ఏం అడ్డు వచ్చినా, తన సోల్ మేట్‌ని కలుస్తారు. లైఫ్‌ని షేర్ చేసుకుంటారు.’ అంటూ టీజర్ ప్రారంభమైంది. టీజర్ ఆద్యంతం విక్రమ్ కుమార్ చిత్రాల శైలిలో సాగింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు సినిమాలో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. అన్నపూర్ణా స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ పతాకంపై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్‌రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. డిసెంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.













