Heera Rajagopal: కోలీవుడ్ స్టార్ హీరోపై హీరా రాజగోపాల్ సంచలన కామెంట్స్
దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ హీరో అజిత్(Ajith) పద్మభూషణ్ అందుకునే వేళ అతనిపై హీరా రాజగోపాల్ (Heera Rajagopal)తీవ్ర ఆరోపణలు చేశారు. హీరా, అజిత్ ఇద్దరూ కలిసి ప్రేమ లేఖ(Prema lekha) సినిమాలో నటించారు. ఆ టైమ్ లో వారిద్దరూ ప్రేమించుకుని రిలేషన్ లో కూడా ఉన్నారనే విషయం తెలిసిందే.
కానీ తర్వాత ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇప్పుడు సడెన్ గా హీరా, తన బ్లాగులో ఓ హీరోపై సంచలన ఆరోపణలు చేస్తూ రాసుకొచ్చారు. అయితే ఆ పోస్ట్ లో హీరా ఎక్కడా అజిత్ పేరు ప్రస్తావించకపోయినా తాను చెప్తోంది అజిత్ గురించేనని అర్థమయ్యేలా రాశారు. కెరీర్ స్టార్టింగ్ లో తాను ఓ హీరోతో రిలేషన్ లో ఉన్నానని, కానీ తర్వాత అతను తనని ఓ ఛీటర్ గా, డ్రగ్స్ అడిక్ట్ గా చూపించి, సమాజంలో తన గౌరవాన్ని దిగజార్చాడని చెప్పారు.
అతనికి వెన్నెముక సర్జరీ జరిగినప్పుడు అతనితో ఉండి తన బెడ్ ప్యాడ్స్ కూడా మార్చానని, అయినా తనని పట్టించుకోవడం మానేశాడని, అక్కడితో ఆగకుండా అతని ఫ్యాన్స్ తో తనపై దాడులు చేయించాడని, కేవలం అతని వల్లే తాను సినిమాలకు దూరమయ్యానని చెప్పారు. ఈ గొడవలు జరుగుతున్న టైమ్ లో ఓ మధ్యవర్తి ద్వారా ఇద్దరం కలిశామని, అప్పుడతను తనను వదిలేస్తున్నట్టు చెప్పడమే కాకుండా పనిమనిషిలా కనిపించే నటిని పెళ్లి చేసుకుంటున్నానని, అప్పుడు తాను ఎవరితో సెక్స్ చేసినా ఇబ్బంది ఉండదని చెప్పాడని హీరా(Heera) తన బ్లాగులో రాసుకొచ్చి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. హీరా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













