త్రివిక్రమ్ చేతుల్లోకి ఆ సినిమా?
పవన్ కళ్యాణ్ తన స్టైల్ ను కాదనుకుని ట్రై చేసిన సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు చాలా ఫాస్ట్ గా పూర్తవుతుందనుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత పవన్ పాలిటిక్స్ లో బిజీ అవడం, ఈ సినిమాను పక్కన పెట్టి వేరే సినిమాలకు డేట్స్ ఇవ్వడం వల్ల ఎదురుచూసీ ఎదురుచూసీ డైరెక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నిర్మాత ఏ.ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ లో డైరెక్టర్ గా జ్యోతికృష్ణ పేరే వేశాడు. ఈ సినిమాను పూర్తి చేయడానికి పవన్ ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తాడా అని చిత్ర యూనిట్ అంతా వెయిట్ చేస్తోంది. అయితే ఈ సినిమాను ఫినిష్ చేయడానికి పవన్ కళ్యాణ్ తన ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ కోరుతున్నట్లు తెలుస్తోంది.
పవన్ ఏం చేసినా దాని వెనుక త్రివిక్రమ్ సపోర్ట్ కచ్ఛితంగా ఉంటుంది. వీరమల్లు సినిమాను అనుకున్న టైమ్ లో పూర్తి చేయాలంటే అది త్రివిక్రమ్ వల్లే అవుతుందని, పవన్ ను కన్విన్స్ చేసే విషయంలో త్రివిక్రమ్ ను మించే వారు లేదని అందుకే ఈ సినిమాను త్రివిక్రమ్ చేతుల్లో పెట్టాలని చూస్తున్నారట నిర్మాత. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













