Hari Hara Veera Mallu: వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేయడమే ఆప్షనా?

ఎప్పుడో కరోనా ముందు మొదలైన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఆల్రెడీ యూఎస్‌లో టికెట్ ప్రీ సేల్స్ మొదలవగా అక్కడ నుంచి మంచి రెస్పాన్సే వస్తుంది. అయితే వీరమల్లు భారీగా వసూలు చేయాలంటే ఈ బుకింగ్స్, ఈ హైప్ సరిపోదు.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై బజ్ పెంచడానికి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసి, అందులో భాగంగానే వీరమల్లు ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమాపై బజ్ ను పెంచాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. రిలీజ్ కు పట్టుమని 20 రోజులు కూడా లేదు, అయినప్పటికీ సినిమా నుంచి ట్రైలర్ ను మేకర్స్ ఇంకా రిలీజ్ చేయలేదు.
రెండేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాకు మంచి హైప్ రావాలంటే వీలైనంత త్వరగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయాలి. వాస్తవానికి అసుర హననం అని రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ తో సినిమాకు మంచి బజ్ వస్తుందని మేకర్స్ భావించారు కానీ ఆ సాంగ్ ఆడియన్స్ ను పెద్దగా ఎట్రాక్ట్ చేయలేకపోయింది. కాబట్టి ఇప్పుడు వీలైనంత త్వరగా వీరమల్లు ట్రైలర్ ను రిలీజ్ చేస్తే అది సినిమా బజ్ కు ఉపయోగపడే ఛాన్సుంది.