HHVM: కుబేరతో వీరమల్లుకు కుదిరే పని కాదు

ఎప్పుడో కరోనాకు ముందు క్రిష్(Krish) మొదలుపెట్టిన హరి హర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రొడక్షన్ దశలోనే నాలుగేళ్ల పాటూ ఉంది. మధ్యలో కరోనా రావడం, తర్వాత పవన్(pawan) ఈ సినిమాను లైట్ తీసుకుని వేరే సినిమాలను పూర్తి చేయడం, ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా మారడం, ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ తప్పుకోవడం, వేరే డైరెక్టర్ ఈ సినిమా బాధ్యతల్ని తీసుకోవడం జరిగాయి.
మొత్తానికి రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 12న రిలీజ్ కు రెడీ అయింది. ఆ మేరకు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు వీరమల్లు మరోసారి వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తవలేదట. అందుకే వీరమల్లు కోసం కొత్త రిలీజ్ డేట్ ను వెతికే పనిలో నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) ఉన్నారని తెలుస్తోంది.
వీరమల్లు రిలీజ్ ను మరీ ఎక్కువ రోజులు వాయిదా వేయకుండా వెంటనే ఉండేలా నిర్మాత చూస్తున్నాడట. ఈ నేపథ్యంలో జూన్ 20న వీరమల్లు రిలీజవుతుందని నెట్టింట వార్తలొస్తున్నాయి. అయితే జూన్ 20న ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna)ల కుబేర(Kubera) సినిమా ఆల్రెడీ లాక్ అయింది. కుబేర సినిమా హక్కులనీ, వీరమల్లు ఓటీటీ హక్కులనీ ప్రైమ్ వీడియో(Prime Video)నే కొనుగోలు చేయడంతో జూన్ 20న వీరమల్లు వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ కోసం జులై 4ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. కానీ ఆ డేట్ కు ఆల్రెడీ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కింగ్‌డమ్(Kingdom) షెడ్యూలైంది. అయితే పవన్ సినిమా వస్తుందంటే విజయ్ సినిమాను వాయిదా వేయడానికి కింగ్‌డమ్ నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ఏ మాత్రం ఆలోచించడనే విషయం అందరికీ తెలిసిందే.