Hari Hara Veera Mallu: వీరమల్లు2కు అదిరిపోయే లీడ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా రిలీజ్ కు రెడీ అయిన సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu). కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా ఇన్నేళ్లకు షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), ఏఎం జ్యోతికృష్ణ(AM Jyothikrishna) దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమాలో నిధి అగర్వాల్(Niddhi Agerwal) హీరోయిన్ గా నటించింది.
చాలా కాలం సెట్స్ పైనే ఉండటంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ రాలేదు. వాస్తవానికి పవన్ సినిమా అంటే థియేటర్ల దగ్గర, సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వీరమల్లుకు ఊహించినంత హైప్ లేదు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ఆ హైప్ ను పెంచే ప్రయత్నాలు వీరమల్లు దర్శకనిర్మాతలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మొదటిభాగం స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ గా రానుండగా మొదటి భాగం క్లైమాక్స్ లో ఇచ్చే లీడ్ ఆడియన్స్ ను సెకండాఫ్ కోసం ఎంత కాలమైనా వెయిట్ చేయించేలా చేస్తుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. దీంతో వీరమల్లు2(Veeramallu2) పై ఇప్పట్నుంచే ఆసక్తి పెరుగుతుంది. ఎంతోకాలంగా సెట్స్ పై ఉన్న వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.