మహేష్ ఓకే అనడమే లేటు..!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా సినిమా గుంటూరు కారం. ఇప్పటికే వీరి కాంబోలో రెండు సినిమాలు రాగా, ఈ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజై ప్రేక్షకుల్ని బాగా మెప్పించాయి. ఇక గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ రావడమే లేట్. థమన్ ఈ సినిమా కోసం ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ చేసి ఇచ్చాడట. అందులో ఓ సాంగ్‌కి ప్రోమో కూడా రెడీ చేశారు. సాంగ్ ని మహేష్ బర్త్‌డే రోజున రిలీజ్ చేయాలని ప్రోమోను కూడా రెడీ చేశారు. కానీ మహేష్ నుంచి ఈ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సాంగ్ ప్లాన్ ను మార్చి పోస్టర్స్‌ని మాత్రమే రిలీజ్ చేశారు.
రీసెంట్గా మహేష్ కోసం స్పెషల్ కేర్ తీసుకుని థమన్ రీసెంట్గా కంపోజ్ చేసిన సాంగ్స్ బాగా వచ్చాయని ఇన్సైడ్ టాక్. ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవడం ఖాయమని యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తుంది. మహేష్ ఓకే చెప్పకపోవడంతోనే సాంగ్ ఇంకా రిలీజ్ అవలేదని తెలుస్తోంది.
ఇందుకు కారణం మహేష్, థమన్ ల మధ్య ఏదో ఇగో క్లాష్ అని తెలుస్తోంది. థమన్ వర్క్ పట్ల మహేష్ కాస్త డిజప్పాయింటెడ్గా ఉన్నాడని, వీరిద్దరి మధ్య త్రివిక్రమ్ నలిగిపోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతున్నది తెలీదు కానీ మహేష్ గ్రీన్ సిగ్నల్ కోసం గుంటూరు కారం టీమ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నదనేది మాత్రం వాస్తవం. థమన్ ఇచ్చిన ట్యూన్‌కి మహేష్ ఓకే అంటే వినాయక చవితికి ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.













