ప్రభాస్ కు అరుదైన గౌరవం
బాహుబలి చిత్రంతో ప్రభాస్ జాతీయస్థాయి నటుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అన్ని భారతీయ భాషలు పరిశ్రమల్లోనూ స్టార్ నటుడయ్యారు. ఆయనచేయబోయే తర్వాతి సినిమాలు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఆయనతో సినిమాలుచేస్తున్న నిర్మాతలు కూడా ఆక్రేజ్ను క్యాష్చేసుకునేందుకు వీలైనన్ని ఎక్కువ భాషల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కారణం బాహుబలి చిత్రమే. ఈ చిత్రం ఒక నటుడిగా ప్రభాస్‌కు ఎన్ని ప్రయోజనాలు అందించాలో అన్నీ అందించింది. అయితే తాజాగా దేశంలోని అత్యంత ప్రభావ వంతమైన వ్యక్తుల జాబితాలో కూడా ఆయన పేరు నిలిచేలా చేసింది. ప్రముఖ మ్యాగజైన్ జిక్యూ అన్ని రంగాల నుండి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అందులో దక్షిణా నుంచి ప్రభాస్ ఒక్కరే ఎన్నిక కావటం విశేషం. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ చిత్రం సాహోలో నటిస్తున్నారు.













