గోపీచంద్ ఆ ఛాన్స్ తీసుకుంటాడా?
మాచో స్టార్ గోపీచంద్ కు మాస్ లో ఎంతో ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరైన హిట్ లేక ఎన్నో ఇబ్బందులు పడిన గోపీచంద్ మార్కెట్ ప్రస్తుతం బాగా డౌన్ అయిపోయింది. ఈ ఫ్లాపులు గోపీచంద్ ఫ్యాన్స్ ను సైతం ఇబ్బంది పెట్టాయి. గోపీచంద్ హీరోగా నటిస్తున్న విశ్వం సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.
శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యాక క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. శ్రీను వైట్ల ఫామ్ లో లేకపోయినా తనదైన కామెడీ ప్లస్ యాక్షన్ మిక్స్ చేసిన తీరు పట్ల పాజిటివిటీ ఉంది. ఇది హిట్ అయితే హీరో, డైరెక్టర్ ఇద్దరికీ మంచి కంబ్యాక్ దక్కుతుంది. ఇక విషయానికొస్తే బాలయ్య-బోయపాటి కాంబోలో రూపొందనున్న భారీ పాన్ ఇండియా సినిమాలో విలన్ గా గోపీచంద్ ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.
ఇప్పటికైతే అనుకున్నారంతే కానీ స్టోరీ నెరేషన్ వరకు ఇంకా వెళ్లలేదట. మంచి కంటెంట్ ఉంటే గోపీచంద్ ఎంత బాగా విలనిజం పండించగలడో ఇప్పటికే జయం, వర్షం, నిజం సినిమాల్లో చూశాం. మరిప్పుడు బాలయ్యకు సవాల్ విసిరే పాత్రకు ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాల్సి ఉంది. లెజెండ్ లో జగపతిబాబుకి విలన్ గా కొత్త కెరీర్ ఇచ్చిన బోయపాటి ఈసారి అంతకుమించి విలన్ క్యారెక్టర్ ను రాసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వం సినిమా హిట్ అయితే గోపీచంద్ ఈ క్యారెక్టర్ చేయకపోవచ్చు. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













