Gopichand Malineni: గోపీచంద్ క్లిక్ అయితే సెటిలైపోవచ్చు!
వీర సింహారెడ్డి(Veera Simhareddy) తర్వాత కొంతకాలం పాటూ వెయిట్ చేసిన గోపీచంద్ మలినేని(Gopichand Malineni) తన తర్వాతి సినిమాను సన్నీ డియోల్(Sunny Deol) తో చేస్తున్న విషయం తెలిసిందే. జాత్(Jaat) అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాతో గోపీచంద్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గోపీ మార్క్ యాక్షన్ అండ్ కమర్షియల్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రస్తుతానికి మంచి అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై బజ్ ను పెంచుతున్నాయి. టాలీవుడ్ మేకింగ్ బాలీవుడ్ ఆడియన్స్ కు కొత్తగా ఉంటుంది. ఇద్దరి మధ్యా చాలా తేడానే ఉంది. ఆ తేడానే తెలుగు డైరెక్టర్లకు నార్త్ లో కలిసొస్తుంది. ఇప్పుడు ఆ లాజిక్ తోనే గోపీచంద్ జాట్ సినిమాను పట్టాలెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
జాట్ కమర్షియల్ హిట్ అయితే మాత్రం బాలీవుడ్ లో గోపీకి లైన్ క్లియర్ అయిపోయినట్టే. ఆ సినిమా సక్సెస్ అయితే బాలీవుడ్ లోని టైర్2 హీరోలంతా ఆయనతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కమర్షియల్ సినిమాలను తీయడంలో మన డైరెక్టర్లను కొట్టే వాళ్లు లేరు. ఈ నేపథ్యంలో గోపీచంద్ జాట్ సినిమాతో సరైన సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. జాట్ హిట్ అయితే మాత్రం గోపీచంద్ బాలీవుడ్ లో ఎంచక్కా సెటిలైపోవచ్చు.













