Balakrishna: హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో బాలయ్య సినిమా
రాజకీయ నాయకుడిగా, హీరోగా, యాంకర్ గా నందమూరి బాలకృష్ణ(nadamuri balakrishna) ప్రతీ దాంట్లోనూ దూసుకెళ్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా అఖండ2(akhanda2) చేస్తున్న బాలయ్య ఆ సినిమాలో రెండు గెటప్స్ లో కనిపించనున్న విషయం తెలిసిందే. అఖండ2 తర్వాత బాలయ్య(balayya) చేయబోయే సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
తనకు వీర సింహారెడ్డి(veera simha reddy) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని(gopichand malineni) దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు డిస్కషన్స్ కూడా జరిగాయని, బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి జాట్(jaat) సినిమా తీసి మంచి ఆదరణ దక్కించుకున్నాడు గోపీచంద్ మలినేని. వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య- గోపీచంద్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలిసిన ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను వృద్ధి సినిమాస్(Vriddhi cinemas) బ్యానర్ లో సతీష్ కిలారు(Satheesh Kilaru) నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్ లో రామ్ చరణ్(Ram Charan) పెద్ది(Peddhi) రూపొందుతున్న సంగతి తెలిసిందే.













