Gopichand Malineni: అట్లీ, సందీప్ తర్వాత స్థానంలో గోపీచంద్ ఉంటాడా?
ఒకప్పుడు నార్త్ లో సౌత్ డైరెక్టర్లను కానీ, సౌత్ నుంచి వచ్చిన సినిమాలను కానీ పట్టించుకునే వారు కాదు. అంతేకాదు సౌత్ సినిమాలు లో బడ్జెట్ సినిమాలని, తక్కువ క్వాలిటీ సినిమాలను భావించే వారు. కానీ ఇప్పుడు సౌత్ సినిమా స్థాయి పెరిగింది. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల స్థాయి అందరికీ అర్థమైంది. బాలీవుడ్ సినిమాలకు సైతం దక్కని రికార్డులను రీసెంట్ గా పుష్ప2(Pushpa2) సాధించడంతో ఇప్పుడంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు.
దీంతో ప్రస్తుతం సౌత్ సినిమాలకు ఉన్న క్రేజ్, డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ లోని టాప్ స్టార్లు సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అట్లీ(Atlee)తో జవాన్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. గతేడాది సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో రణ్ బీర్ కపూర్(Ranbir Kapoor) యానిమల్(Animal) చేసి మంచి హిట్ ను సాధించారు.
సల్మాన్ ఖాన్(Salman Khan) ప్రస్తుతం మురగదాస్(murugadoss) దర్శకత్వంలో సికిందర్(Sikindar) సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా గోపీచంద్ మలినేని(Gopichand Malineni) సన్నీ డియల్(sunny deol) తో జాట్(Jaat) అనే సినిమాను చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ కు అందరూ ఫిదా అవుతున్నారు. సన్నీని ఇలా కూడా చూపించొచ్చా అని డైరెక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. జాట్ తో గోపీచంద్ సక్సెస్ అందుకుంటే తర్వాత వరుసగా బాలీవుడ్ లో పెద్ద స్టార్లతో సినిమాలు చేసే అవకాశాలు రావడం ఖాయం. అట్లీ, సందీప్ రెడ్డి ఎలా అయితే బాలీవుడ్ లో తమ డిమాండ్ ను పెంచుకున్నారో గోపీచంద్ కూడా జాట్తో తన సత్తా చాటితే బాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలున్నాయి.













