Gopichand Malineni: కరెక్ట్ టైమ్ లో ఎంట్రీ ఇస్తున్న గోపీచంద్
పుష్ప(Pushpa), పుష్ప2(Pushpa2) నార్త్ ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఈ సినిమాల్లో మాస్ యాంగిల్ ఎక్కువగా హైలైట్ చేయడమే. పుష్ప మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో పుష్ప క్యారెక్టర్ ని మరింత మాస్ గా తీర్చిదిద్దాడు సుకుమార్(Sukumar). ఈ రేంజ్ మాస్ కంటెంట్ బాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ నుంచీ రాలేదు.
అందుకే పుష్ప అక్కడ అంతగా సక్సెస్ అయింది. బాలీవుడ్ సినిమాల్లో మాస్ అంటే యాక్షన్ చూపిస్తారు తప్పించి పాత్ర బలాన్ని, భావోద్వేగాలను మాత్రం కనెక్ట్ చేయరు. బాలీవుడ్ స్టార్లు కూడా ఈ విషయాన్ని పలుమార్లు ఒప్పుకున్నారు. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) బాలీవుడ్ హీరో సన్నీ డియోల్(sunny Deol) తో జాట్(jaat) అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
కమర్షియల్ మాస్ సినిమాలు చేయడంలో గోపీచంద్ మలినేని మంచి నిపుణుడు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మాస్ కంటెంట్ ను చాలా బాగా డీల్ చేయగలడు. ఇప్పుడు జాట్ సినిమాకు అదే ప్లస్ కానుంది. తెలుగు ఆడియన్స్ కు గోపీచంద్ మాస్ కొత్తగా అనిపించకపోయినా బాలీవుడ్ ఆడియన్స్ కు మాత్రం ఇదే కొత్త కాబట్టి ఆయన మాస్ నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇవన్నీ చూసి గోపీచంద్ సరైన టైమ్ లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.













