Gopichand Malineni: జాట్ కోసం ముందు అనుకున్న హీరో ఎవరంటే
వీర సింహారెడ్డి(Veera simhareddy) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand malineni) ఆ సినిమా తర్వాత ఏకంగా బాలీవుడ్ లో సినిమా చేశాడు. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్(Sunny deol) ప్రధాన పాత్రలో జాట్(jaat) అనే సినిమాను తెరకెక్కించి, ఆ సినిమాతో మంచి హిట్ అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు గోపీచంద్. జాట్ సినిమా మంచి టాక్ తో పాటూ కలెక్షన్లను కూడా వసూలు చేసింది.
జాట్ లో సన్నీ డియోల్ ను గోపీచంద్ మలినేని చూపించిన విధానానికి బాలీవుడ్ మొత్తం ఫిదా అయింది. సన్నీ డియోల్ ను ఇప్పటివరకు ఎవరూ అలా చూపించింది లేదు. గదర్2(Gadhar2) తర్వాత జాట్ సినిమా ద్వారా సన్నీ డియోల్ కూడా మరో హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ సన్నీ డియోల్ కంటే ముందు మరో సీనియర్ హీరో దగ్గరకు వెళ్లిందట.
ఆయన మరెవవో కాదు, నందమూరి బాలకృష్ణ. ఈ విషయాన్ని స్వయంగా గోపీచంద్ మలినేనినే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. క్రాక్(Crack) సినిమా తర్వాత బాలయ్యకు కథ చెప్పడానికి వెళ్లినప్పుడు తాను ముందుగా జాట్ కథనే చెప్పానని, కానీ అఖండ తర్వాత అందరికీ అంచనాలు ఎక్కువయ్యాయని, ఆ అంచనాలను అందుకోవాలంటే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా అయితే బావుంటుందని చెప్పడంతో జాట్ కథను పక్కనపెట్టి వీర సింహారెడ్డిని తీసినట్టు గోపీచంద్ మలినేని తెలిపాడు. దీంతో జాట్ బాలయ్య చేసి ఉంటే ఇంకా బావుండేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






