క్రాక్ డైరక్టర్ కు మరో బంపరాఫర్.. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై
ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరికీ తెలీదు. క్రాక్ రూపంలో ఫ్లాపుల్లో ఉన్న డైరక్టర్ గోపీచంద్ మలినేనికి అలాంటి ఛాన్సే వెతుక్కుంటూ వచ్చినట్లైంది. సంక్రాంతి ముందుకు రిలీజ్ బంపర్ హిట్ కొట్టిన ఆ సినిమా అటు రవితేజకు, ఇటు గోపీచంద్ మలినేని కెరీర్లకు చాలా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో బాలయ్య స్వయంగా గోపీచంద్ ను పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే గోపీచంద్ కి మరో బంపరాఫర్ తగిలిందట. మైత్రీ మూవీ మేకర్స్ లో రానున్న బాలయ్యతో సినిమా హిట్ అయితే, తర్వాత మహేష్ ను డైరెక్ట్ చేసే అవకాశమిస్తామని మలినేనికి పెద్ద ఆఫరే ఇచ్చారట.
దీంతో ఎట్టి పరిస్థితుల్లో బాలయ్యతో హిట్టిచ్చేలా చేయడానికి ఈ ఎర వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో మలినేని తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ కోసం ఎంతో పట్టుదలగా పని చేస్తున్నారని తెలిసింది. ఈ యేడాది ద్వితీయార్థంలో షూటింగ్ మొదలు కానుందని, మ్రైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు మహేష్ తో మంచి రిలేషన్ ఉంది. సర్కారు వారి పాట నిర్మాతల్లో వీరు కూడా ఒకరిగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ బాలయ్యతో గోపీచంద్ మలినేని హిట్ కొడితే మహేష్ తో సినిమా ఉండే ఛాన్సులు ఎక్కువే.













