దేవర రిలీజ్ డేట్ ప్లాన్ అదిరింది
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న భారీ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా దేవర. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే దేవర1 రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 10న దేవర ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.
వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్, విఎఫ్ఎక్స్, సంగీతం కారణంగా సినిమా వాయిదా పడింది. అయితే దేవర ఇప్పుడు అనౌన్స్ చేసిన అక్టోబర్ 10వ తేదీ వెనుక మంచి స్ట్రాటజీనే ఉంది. అక్టోబర్ 12న దసరా. అంటే దసరాకు రెండ్రోజుల ముందు దేవర థియేటర్లలోకి వస్తుంది.
ఎంత కాదన్నా దసరాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వారానికి పైగా సెలవులుంటాయి. మొత్తం పది రోజుల వరకు సెలవులుంటాయి కాబట్టి వీకెండ్ తో పాటూ హాలిడే సీజన్ ను కూడా క్యాష్ చేసుకునే దిశగా దేవర టీమ్ ప్లాన్ చేసింది. ఇదే దసరా సీజన్ పై గేమ్ ఛేంజర్, కంగువ సినిమాలు కూడా కన్నేశాయని వార్తలొచ్చాయి. కానీ ముందు జాగ్రత్త వహించి దేవర టీమ్ ముందుగానే కర్ఛీఫ్ వేసుకున్నారు. షూటింగ్ ఇంకా చాలా భాగం బ్యాలెన్స్ ఉండటంతో ఆగస్ట్ లోపు సాంగ్స్ తో సహా టోటల్ సినిమాను కంప్లీట్ చేయాలని కొరటాల చూస్తున్నాడట. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనుండగా, అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.













