Santhana Prapathirastu: “సంతాన ప్రాప్తిరస్తు” ప్రీమియర్ షోస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది – మధుర శ్రీధర్ రెడ్డి
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు” (Santhana Prapathirastu). ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – ఏ సినిమా చేసినా అందులో పర్పస్ ఉండాలని కోరుకునే దర్శక నిర్మాతను నేను. సినిమాలో వినోదంతో పాటు ఒక చిన్న మెసేజ్ ఏదైనా ఉండాలని ప్రయత్నిస్తాను. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను కూడా అలాగే ఫన్, మెసేజ్ తో నిజాయితీగా ప్రయత్నం చేశాం. తెలుగు సాహిత్యానికి సినిమాకు మధ్య గ్యాప్ వచ్చింది. అందుకే వైవిధ్యమైన చిత్రాలు తగ్గిపోయాయని నా అభిప్రాయం. మన లిటరేచర్ తో ట్రావెల్ అయితే తెలుగులోనూ మలయాళ ఇండస్ట్రీలోలా కొత్త తరహా మూవీస్ చేయొచ్చు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాకు ప్రీమియర్స్ ద్వారా వస్తున్న రెస్పాన్స్ తో సంతృప్తిగా ఉన్నాం. ఇదే రెస్పాన్స్ రేపు థియేట్రికల్ గా వస్తే ఇంకా సంతోషిస్తాం. సినిమా విజయంపై మా టీమ్ అంతా కాన్ఫిడెంట్ గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి రిలీజ్ తో పాటు కొన్ని సౌత్ స్టేట్స్ లోనూ సినిమా విడుదలవుతోంది. మన దగ్గర వచ్చే టాక్ ను బట్టి పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు డిమాండ్ వస్తుందని నమ్ముతున్నాం. యూఎస్ లో నెంబరాఫ్ లొకేషన్స్ దొరికాయి.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు యూఎస్ లో రిలీజ్ చేస్తున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో మొదట్లో భయంగా ఉండేది కానీ వాళ్లు యూఏ సర్టిఫికేషన్ ఇచ్చారు. అంటే ఫ్యామిలీతో కలిసి మా సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. డైరెక్టర్ సంజీవ్ తో నాది లాంగ్ జర్నీ. ఈ సినిమాను కష్టపడి చేశాడు. హీరో విక్రాంత్ కు మంచి పేరు తెచ్చే మూవీ అవుతుంది. ఈ సినిమా తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేయాలంటే విక్రాంత్ ను మేకర్స్ అప్రోచ్ అవుతారు. ఇన్ ఫెర్టిలిటీ మన ఆడియెన్స్ కు కొత్త విషయం కాదు. మనం చదువుకునే రోజుల నుంచే ఇలాంటి విషయాలపై అవగాహన ఉంది. ఓటీటీల్లో వెర్సటైల్ కంటెంట్ చూస్తున్న తెలుగు ఆడియెన్స్ ఇన్ ఫెర్టిలిటీ నేపథ్యంగా తీసిన సినిమాను చూసేందుకు సందేహిస్తారని అనుకోవడం లేదు. ఇండస్ట్రీలో మా సర్కిల్ లో మూవీ చూపించాం. అయితే ప్రివ్యూలు వేసినప్పుడు థియేటర్స్ లో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మరికొన్ని ప్రివ్యూస్ వేస్తున్నాం. నిజాయితీగా మేము చేసిన ప్రయత్నాన్ని క్రిటిక్స్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సినిమా రిలీజ్ తర్వాత థియేటర్స్ విజిట్, సక్సెస్ టూర్స్ ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ – నేను కృష్ణవంశీ గారి దగ్గర వర్క్ చేశాను. మనం చేసే సినిమా వల్ల సమాజానికి చెడు జరగకూడదు అని ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అలాగే శ్రీధర్ గారి స్నేహంలో పర్పస్ ఫుల్ సినిమాలు చేయాలనే ఆలోచనలు బలపడ్డాయి. మన చుట్టూ ఉంటే వ్యక్తుల ప్రభావమే మనపై ఉంటుంది. నాకు ఉన్న ఈ స్నేహితులు మంచి కంటెంట్ ప్రేక్షకులకు ఇచ్చేందుకు ఇన్స్ పైర్ చేస్తున్నారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో మేము ఏ ఏ సీన్స్ లో ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారని ఆశించామో వాటితో పాటు మేము ఎక్స్ పెక్ట్ చేయని సీన్స్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న మూవ్ మెంట్స్ కు కూడా నవ్వుతుున్నారు. ప్రివ్యూస్ వేసిన థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం. మూవీలో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మెసేజ్ ఉంటుంది. ఏ సినిమా అయినా చివరలో ఒక మంచి మాట చెబితేనే ఆ మూవీకి ఒక పర్పస్ ఏర్పడుతుంది. రేపు మా మూవీ రిలీజ్ కు వస్తోంది. థియేట్రికల్ గా వచ్చే రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాం. అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” ప్రివ్యూస్ చూసిన ఆడియెన్స్ వచ్చిన రెస్పాన్స్ తో మేము ఈ సినిమాకు పడిన కష్టం ఫలించింది అనిపించింది. మా మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రివ్యూస్ లోనే తెలిసిపోయింది. మీరు ఈ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకుని చివరలో చిన్న ఎమోషన్ ఫీల్ అయి, ఒక మంచి మెసేజ్ తో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. ప్రివ్యూస్ లో సినిమా చూస్తున్నంత సేపు ఎవరూ తమ ఫోన్స్ కూడా చూడలేదు. అంతగా సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సెన్సార్ నుంచి యుఎ సర్టిఫికేషన్ వచ్చింది. అన్ని ఎజ్ గ్రూప్స్ ఆడియెన్స్ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు. నన్ను ఈ చిత్రంలో చైతన్య పాత్ర కోసం మలిచి, బాగా పర్ ఫార్మ్ చేయించిన మా దర్శకుడు సంజీవ్ రెడ్డి గారికి, నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా శ్రీధర్ గారికి థ్యాంక్స్. అన్నారు.






