గంగూబాయి కథియవాడి లో అలియాభట్ లుక్
అలియాభట్ కథానాయికగా సంజయ్‌లీలాభన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం గంగూబాయ్ కథియావాడి. ముంబయిలోని కామటిపుర ప్రాంతానికి చెందిన గంగూబాయి అనే మహిళాడాన్ జీవితం ఆధారంగా సంజయ్‌లీలాభన్సాలీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలియా భట్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రిబ్బన్లతో కూడిన రెండు జడలు, చెంపపై మచ్చతో తిలకం పెట్టుకొని వినూత్నంగా కనిపిస్తున్నది అలియాభట్. ఆమె పక్కన టేబుల్‌పై తుపాకీ ఉండటం ఆసక్తిని పంచుతున్నది. బలం, అధికారం, భయం.. ఒక్క చూపు వేల భావోద్వేగాలు అంటూ చిత్రబృందం ఆమె పోస్టర్‌కు వ్యాఖ్యను జోడించింది.













