వెనక్కి వెళ్లనున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి?
చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ కాకపోతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ లో కనిపించనని హీరో విశ్వక్సేన్ అప్పట్లో శపథం చేసిన విషయం తెలిసిందే. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మూవీ పోస్ట్‌పోన్ అవుతుందనే ఆందోళనలో విశ్వక్ అలా అన్నాడని నిర్మాత నాగవంశీ ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చాడు.
అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి రీసెంట్ గా దీపావళికి రిలీజ్ చేసిన పోస్టర్ లో రిలీజ్ డేట్ లేకపోవడంతో పోస్ట్‌పోన్ కన్ఫర్మ్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు డిసెంబర్ 8కి బదులు సలార్ రిలీజ్ తర్వాత 29న రిలీజ్ చేద్దామనుకుంటున్నట్లు టాక్. దీని వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సలార్ వల్ల థియేటర్లు దొరకవనే టెన్షన్ ఉండదు.
పైగా సోలో రిలీజ్ కాబట్టి మంచి టాక్ వస్తే కలెక్షన్లకు ఢోకా ఉండదు. సంక్రాంతి వరకు మరో సినిమా ఉండదు కాబట్టి ఇదే మంచి డేట్ అనుకుని విశ్వక్ కూడా నిర్మాత నాగవంశీ డెసిషన్ కే ఓటేశాడట. హాయ్ నాన్న, ఎక్స్ట్రా, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలతో పోటీ పడటం కంటే ఇలా సోలో రిలీజే బెటర్. ఏదేమైనా చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న విశ్వక్ తొందరపడి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇప్పటికైనా మానేస్తే బెటర్.













