ఓటీటీ లో గాలోడు..
సుడిగాలి సుధీర్ చిన్న మెజిషియన్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశాడన్న విషయం తెలిసిందే. తర్వాత బుల్లితెర కామెడీ షో అయినటువంటి జబర్దస్త్ తో ఒక్కసారిగా సుధీర్ దశ మారిపోయిందని చెప్పొచ్చు. తనదైన కామెడీ పంచ్ లతో ఆద్యంతం బుల్లితెర ప్రేక్షకులని నవ్వించడంలో సుధీర్ దిట్ట. తర్వాత డాన్స్ షోలో తోటి యాంకర్ అయినటువంటి రష్మీతో ఆన్ స్క్రీన్ ప్రేమాయణం నడుపుతూ ఇంకా పాపులర్ అయ్యాడు. ఈ తరుణంలోనే కొన్ని షోస్ కి యాంకర్ గా కూడా సుధీర్ వర్క్ చేయడం జరిగింది. మెల్లిగా ఇటు బుల్లితెరను మేనేజ్ చేస్తూనే ఈ మాయగాడు బిగ్ స్క్రీన్ పై కూడా తన దృష్టిని పెట్టాడు.
ఒక వైపు టెలివిషన్ షోస్ చేస్తూనే సుధీర్ వెండితెరపైకి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఫ్రెండ్ పాత్రలు చేసినా కాస్త క్రేజ్ వచ్చిన తర్వాత హీరోగా సాఫ్ట్ వెర్ సుధీర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. హీరో అయినా కూడా టెలివిషన్ ని, షోస్ ని వదలకుండా రెండింటిని మేనేజ్ చేస్తున్నాడు సుధీర్. తర్వాత తన స్నేహత్రయం తో కలిసి త్రి మంకీస్ అనే సినిమాలో కూడా నటించాడు. స్టాండ్ అప్ కామెడీతో ప్రేక్షకులని అలరించడం సుధీర్ కి వెన్నెతో పెట్టిన విద్య అంటే అతిశయోక్తి కాదు.
రీసెంట్ గా గాలోడు అంటూ ఆడియన్స్ ముందుకి వచ్చిన సుడిగాలి సుధీర్ బాక్సాఫీస్ వద్ద హిట్ ని కొట్టాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇటు బుల్లితెర, అటు వెండితెర నటీనటులు సుధీర్ కి ఎంతో సపోర్ట్ చేశారనే చెప్పాలి. గాలోడు సినిమా టాలీవుడ్ ప్రేక్షకులని ఆకట్టుకొని నిర్మాతలకి కలెక్షన్ల వర్షం కురిపించింది. చిన్న సినిమాగా రిలీజై భారీ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా గాలోడు సినిమా హక్కులని సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 17 నుండి అఫీషియల్ గా ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతుందని ఆహా టీం తెలిపారు. బిగ్ స్క్రీన్ పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఈ సినిమా ఓటీటీలో ఆడియన్స్ సక్సెస్ చేస్తారో లేదో చూడాలి.













