Funky: ఫంకీ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ అప్డేట్

మొన్నటివరకు సక్సెస్, ఫ్లాపు తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసిన టాలీవుడ్ యంగ్ టాలెంట్ విశ్వక్ సేన్(viswaksen) లైలా(laila) సినిమా తర్వాత కాస్త స్పీడును తగ్గించాడు. ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన లైలా సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకోవడమే కాకుండా, విశ్వక్ గతంలో ఎన్నడూ అందుకోని విమర్శలు ఎదుర్కొనేలా చేసింది ఆ సినిమా.
లైలా రిజల్ట్స్ తో విశ్వక్ మార్కెట్ విపరీతంగా పడిపోయింది. దీంతో తర్వాతి సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని ఎంతో కసిపై ఉన్నాడు విశ్వక్. అందులో భాగంగానే నెక్ట్స్ సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న విశ్వక్, దాని కోసం జాతిరత్నాలు(jathiratnalu) ఫేమ్ అనుదీప్ కెవి(anudeep KV) తో చేతులు కలిపి ఫంకీ(Funky) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
మామూలుగా సినిమా మొదలుపెట్టిన ఆరు నెలలకే దాన్ని పూర్తి చేసి రిలీజ్ చేసే టైప్ అనుదీప్. కానీ ఫంకీ మొదలై చాలా రోజులవుతున్నా ఇంకా ఆ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అప్డేట్ ను ఇవ్వలేదు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఫంకీ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. కయాదు లోహర్(Kayadhu Lohar) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) బ్యానర్ లో నాగవంశీ(naga vamsi) నిర్మిస్తున్నాడు.