Sonakshi Sinha: మరో తెలుగు సినిమాకు సైన్ చేసిన బాలీవుడ్ భామ
టాలీవుడ్ సినిమా స్థాయి బాగా పెరిగిన నేపథ్యంలో బాలీవుడ్ భామలకు టాలీవుడ్ పై కన్ను పడింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఇక్కడ కూడా రాణించాలని టాలీవుడ్ సినిమాలపై కన్నేసి వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే దీపికా పదుకొణె(deepika padukone), అనన్య పాండే(Ananya pandey), జాన్వీ కపూర్(janhvi Kapoor) టాలీవుడ్ కు పరిచయం కాగా సోనాక్షి సిన్హా(sonakshi sinha) త్వరలోనే పరిచయం కానుంది.
సుధీర్ బాబు(sudheer babu) హీరోగా వెంకట్ కళ్యాణ్(Venkat kalyan) దర్శకత్వంలో వస్తోన్న ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ జటాధర(jatadhara) సినిమాలో సోనాక్షి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతోనే అమ్మడు టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. అయితే జటాధర ఇంకా రిలీజవకుండానే ఇప్పుడు సోనాక్షి తెలుగులో మరో ఎగ్జైటింగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ లోని మోస్ట్ హ్యాపెనింగ్ హీరో ఈ సినిమాలో హీరోగా నటించనుండగా, అతని సరసన సోనాక్షి హీరోయిన్ గా నటించనుందని, ఈ సినిమాలో సోనాక్షి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండటంతో పాటూ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.







