The Raja Saab: డార్లింగ్ బర్త్ డే కు ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా?
ఈ మధ్య హీరోల పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ బర్త్ డే విషెస్ తెలియచేస్తూ సినిమా నుంచి ఏదొక కంటెంట్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడం ట్రెండ్ గా మారింది. అందులో భాగంగానే త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) బర్త్ డే రానుంది. అయితే ప్రభాస్ బర్త్ డే కు ది రాజా సాబ్(the raja saab) నుంచి ఫస్ట్ సింగిల్ రానుందని మేకర్స్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు.
దీంతో ఎప్పుడెప్పుడు ఆ సాంగ్ వింటామా అని ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం రాజా సాబ్ నుంచి ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఎలాంటి అప్డేట్ రావడం లేదని తెలుస్తోంది. సాంగ్ కు సంబంధించి పనులు ఇంకా పూర్తి కానుందున డార్లింగ్ బర్త్ డేకు ఫస్ట్ సింగిల్ రావడం అనుమానమే అన్నట్టు టాక్ వినిపిస్తుంది.
అయితే ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. తమన్(thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్(malavika mohanan), నిధి అగర్వాల్(nidhhi Agerwal), రిద్ధి కుమార్(riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(people media factory) భారీ బడ్జెట్ తో రాజా సాబ్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 9న సంక్రాంతి కానుకగా రాజా సాబ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













