బజ్ పెంచడానికి ఫ్యామిలీ స్టార్ ప్లాన్లు
విజయ్ దేవరకొండకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. దానికి గల కారణం గీత గోవిందం సినిమా. ఆ సినిమా తర్వాత మళ్లీ విజయ్ టాక్సీవాలా సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. కానీ గీత గోవిందం రేంజ్ హిట్ మాత్రం విజయ్ కు మళ్లీ పడలేదు. లైగర్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు కానీ సినిమా డిజాస్టర్ అయింది.
ఖుషి సినిమా విజయ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది కానీ ఆశించిన స్థాయిలో మాత్రం సినిమా ఆడలేదు. ఇప్పుడు విజయ్ మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే పనిలో భాగంగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. గీత గోవిందం సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న రెండో సినిమా ఇది.
ఇప్పటికే సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. రిలీజ్ చేసిన గ్లింప్స్ కు కూడా సూపర్ క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఫ్యామిలీ స్టార్ నుంచి టీజర్ ను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ టీజర్ తో సినిమాపై ఉన్న హైప్ ను మరింత పెంచేలా ఆ టీజర్ ను కట్ చేయాలని చూస్తున్నారట. ఎలాగైనా ఈ సినిమాతో కచ్ఛితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్. నిర్మాత దిల్ రాజు కూడా ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ విషయంలో చాలా సంతృప్తికరంగా ఉన్నాడని తెలుస్తోంది. మరి ఫ్యామిలీ స్టార్ విజయ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













