ఆ లేటు భలే మ్యాజిక్ చేసింది
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నలుగురు టీనేజ్ వయసున్న వారితో మ్యాజిక్ అనే సినిమా అనౌన్స్ అయింది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ అవడమే విశేషం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ గా ఇదే బ్యానర్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.
ఫ్యామిలీ స్టార్ తో పాటూ ఈ సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని రౌడీ రెండు సినిమాలను ఒకేసారి మొదలుపెట్టాడు. కానీ సంక్రాంతికి ఎలాగైనా ఫ్యామిలీ స్టార్ ను పూర్తి చేయాలని దిల్ రాజు గట్టిగా అనుకోవడంతో గౌతమ్ తిన్ననూరి సినిమాను విజయ్ పక్కన పెట్టాల్సి వచ్చింది. ఫారిన్ షెడ్యూల్స్ వల్ల ఫ్యామిలీ స్టార్ అనుకున్నట్లుగా సంక్రాంతికి రిలీజ్ కాలేదు.
దీంతో విజయ్ దేవరకొండ- గౌతమ్ సినిమాకు టైమ్ పడుతుందని భావించిన నిర్మాత నాగవంశీ, గౌతమ్ దగ్గరున్న మరో సబ్జెక్ట్ తో మ్యాజిక్ అనే సినిమాను కొత్త వాళ్లతో సెట్స్ పైకి తీసుకెళ్లి దాదాపు షూటింగ్ ను పూర్తి చేశాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ పూర్తయ్యే టైమ్ కు ఫ్యామిలీ స్టార్ పూర్తి చేసుకుని విజయ్ లైన్ లోకి వచ్చేస్తాడు. అప్పుడు మళ్లీ VD12 స్టార్ట్ చేయొచ్చు. ఏదేమైనా టైమ్ ను వేస్ట్ చేయకుండా గౌతమ్ తీసుకున్న నిర్ణయం సరైనదే.













