ED Notices :పలువురు సినీ ప్రముఖుల కు ఈడీ నోటీసులు

బెట్టింగ్ యాప్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి కు నోటీసులు ఇచ్చింది. రానా జులై 23న విచారణకు రావాలని పేర్కొంది. 30న ప్రకాశ్‌రాజ్ (Prakashraj), ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్ట్ 13న మంచు లక్ష్మీ (Manchu Lakshmi) విచారణకు హాజరుకావాలని ఈడీ సూచించింది.