Dude: రిలీజ్ కు ముందే లాభాల్లో డ్యూడ్

కోలీవుడ్ లో డైరెక్టర్ గా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ యూత్ ఫుల్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ డ్యూడ్(Dude). ఆల్రెడీ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయగా, రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ట్రైలర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. కీర్తీశ్వరన్(Keertheswaran) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రేమలు(Premalu) ఫేమ్ మమితా బైజు(Mamitha Byju) హీరోయిన్ గా నటించింది. సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కీలక పాత్ర నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించగా దీపావళి సందర్భంగా డ్యూడ్ రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమా గురించి ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది. డ్యూడ్ మూవీని మొత్తం రూ.40 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, అది మొత్తం నిర్మాతలకు నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే వచ్చేసిందని తెలుస్తోంది. దీని ప్రకారం చూసుకుంటే డ్యూడ్ మూవీ రిలీజ్ కు ముందే ప్రాఫిట్ లోకి ఎంటరైందని అర్థమవుతుంది. అక్టోబర్ 17న రిలీజ్ కానున్న డ్యూడ్ సినిమాకు సాయి అభ్యంకర్(Sai Abhyankar) మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.