Dude: లవ్ టుడే, డ్రాగన్ లానే డ్యూడ్ కూడా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది- ప్రదీప్ రంగనాథన్

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ (Dude) తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. హైదరాబాదు నాకు ఇంకో ఫ్యామిలీ. నా సినిమాలన్నీ గొప్పగా ఆదరించారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ కుటుంబంలో ఒకరిగా చూసినందుకు చాలా థాంక్స్. లవ్ టుడే, డ్రాగన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా డ్యూడ్ కూడా నచ్చుతుంది. అదిరిపోయే సినిమా ఇది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మైత్రి మూవీ మేకర్స్ కి థాంక్యూ. నాకు తెలుగులో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలని ఉంటుంది. ఇది నాకు మంచి అవకాశం. మైత్రి మూవీ మేకర్స్ చాలా అద్భుతంగా పే చేస్తారు. ఈ సినిమా కోసం చాలా మంచి పేమెంట్స్ తీసుకున్నాను.(నవ్వుతూ)డైరెక్టర్ కీర్తికి థాంక్యూ. చాలా మంచి సినిమా తీశాడు. సినిమా చూసిన తర్వాత అతను ఎంత పెద్ద డైరెక్టర్ అవుతారో మీరే చెప్తారు. సాయి చాలా పెద్ద కంపోజర్ అవుతాడు. ఇప్పటికే తనకి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. మమిత కి థాంక్యూ. తను అద్భుతమైన ఎనర్జీతో పెర్ఫాం చేశాడు. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికి థాంక్యూ. నికేత్ బొమ్మకి థాంక్యూ. డ్యూడ్ అక్టోబర్ 17న రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. తెలుగు ఆడియన్స్.. ఐ లవ్ యు ఫరెవర్.
హీరోయిన్ మమిత బైజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మాము సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ థాంక్యు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి స్ట్రాంగ్ పిల్లర్. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రదీప్ గారితో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ . డ్యూడ్ సినిమా అక్టోబర్ 17 రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్ లో వాచ్ చేయండి.
మూవీ డైరెక్టర్ కీర్తి ఈశ్వరన్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఇది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నేను స్క్రిప్ట్ రాసుకుని దర్శకుడు కావాలనుకున్న తర్వాత చెన్నై మొత్తం తిరిగాను. ఫైనల్ గా ఇక్కడ జూబ్లీహిల్స్ లో నా సినిమా జర్నీ మొదలైంది. నా కలలో కూడా మైత్రి మూవీ మేకర్స్ తో వర్క్ చేస్తానని అనుకోలేదు. తెలుగు దర్శకులంతా వచ్చి మాకు బ్లెస్సింగ్ ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చింది. ప్రదీప్ గారు తెలుగు ఆడియన్స్ గురించి చాలా ఆలోచిస్తారు. నేను ఈ సినిమా చేస్తున్న క్రమంలో ప్రతి సీన్ చదివి ఇవి ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనే వారు. మమిత చాలా స్వీట్. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ మామితని చూస్తారు. అల్లు అర్జున్ గారి ఆర్య, ఈ స్క్రిప్ట్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. మ్యూజికల్ సెన్సేషన్ సాయికి థాంక్యూ. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో బాగుండు పో అనే పాట ఉంది. ఈ సినిమాకు కోర్ కూడా అదే. తెలుగు ఆడియన్స్ మంచి ఎమోషన్స్, జెన్యూన్ ఫిలిం ఇష్టపడతారు. దీపావళి తో పాటు ఈ సినిమా సెలబ్రేట్ చేసుకొనేలా వుంటుంది.
డైరెక్టర్ హను రాఘవపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్ లో కీర్తి సినిమా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను. తనకి చాలా మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇందులో బూమ్ బూమ్ సాంగ్ మంచి వైబ్ ఇచ్చింది. ఈ సాంగ్ ఒక్కటి చాలు ఈ సినిమా వైబ్ చెప్పడానికి. ప్రదీప్, మమత కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.
డైరెక్టర్ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను రంగస్థలంలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పటి నుంచి నవీన్ గారు రవి గారు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. నా ఫస్ట్ ఫిలింకి మైత్రి మూవీ మేకర్స్ దొరకడం అదృష్టం. డ్యూడ్ సినిమా గురించి రవిగారు నవీన్ గారు చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రదీప్ గారికి నేను పెద్ద ఫ్యాన్. ఈ సినిమా హిట్ వైబ్రేషన్ ముందే తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.
డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్ మా జీవితంలోకి వచ్చాక అన్నీ చాలా ఈజీగా అనిపిస్తున్నాయి. డైరెక్టర్ కీర్తికి తెలుగులోకి వెల్కం. సాయి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ కనిపించింది. ప్రదీప్ గారు అందరికీ కనెక్ట్ అయ్యే హీరో. మా అందరినీ ప్రదీప్ గారిలో చూసుకుంటున్నాం. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.
డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా గురించి విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ గ్రేట్ ప్లాట్ఫారం. అన్ని చోట్ల నుంచి టాలెంట్ కోలాబరేట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రదీప్ గారి గత రెండు సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా ఖచ్చితంగా హ్యాట్రిక్ అవుతుందని నమ్మకం ఉంది.
డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా అందులో మంచి కంటెంట్ ఉంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సాయి మ్యూజిక్ ఒక లూప్ లో వింటున్నాను. ప్రదీప్ గారు మమత గారు అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
డైరెక్టర్ శివ నిర్మాణ మాట్లాడుతూ… చాలా రోజుల తర్వాత ఒక యూత్ ఫుల్ ఫిలిమ్. 17న మీ అందరితో పాటు నేను కూడా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను కీర్తికి ఈ సినిమా చాలా మంచి విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను. లవ్ టు డే సినిమా చూసి థియేటర్లో చాలా ఎంజాయ్ చేశాను. అలాగే డ్రాగన్ కూడా నచ్చింది. ఈ సినిమాతో ప్రదీప్ గారికి హ్యాట్రిక్ పడుతుంది. మైత్రి మూవీ మేకర్స్ సినిమా అంటే మాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఇలానే ఉంటుంది. ఈ సినిమా మైత్రిలో మరో పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాకి టీమ్ అందరూ ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు. సినిమా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. అక్టోబర్ 17న అందరూ థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలని కోరుతున్నాం.
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాము. అక్టోబర్ 17న అందరూ థియేటర్స్ కి కొచ్చి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. మా హీరో ప్రదీప్ గారికి డైరెక్టర్ కీర్తి గారికి సాయి మమత నికేత్ గారు టీమ్ అందరికీ థాంక్యూ. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమా తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది.
రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్ హస్తవాసి చాలా మంచిది. ఈ సినిమాతో కీర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది చాలా శుభారంభం. డైరెక్టర్ కీర్తి చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. పర్సనల్గా నాతో ఇంట్రాక్ట్ అయ్యి ఈ సినిమా లిరిక్స్ రాయించారు. అది ఆయనకి వర్క్ మీద ఉన్న ఫ్యాషన్. ప్రదీప్, మమత ఇలా చాలా మంచి టీం తో వస్తున్న సినిమా తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది. ఈ సినిమాతో ప్రదీప్ గారు హ్యాట్రిక్ కొడతారని నమ్మకం ఉంది.
మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా దీపావళికి వస్తుంది. అందరు కూడా సినిమాని థియేటర్లో చూసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
డిఓపి నిఖిత్ బొమ్మి మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు వెరీ బిగ్ కాన్వాస్ లోకి వచ్చింది. డైరెక్టర్ కీర్తి సినిమాని చాలా అద్భుతంగా తీశారు. డ్యూడ్ టీంతో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధిస్తుంది. మూవీ యూనిట్ అందరూ పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.