Disney: డిస్నీ ఉద్యోగుల వేటుకు కారణమిదే

ప్రముఖ ఎంటర్టైనింగ్ ఛానెల్ వాల్ట్ డిస్నీ(Disney) పలు విభాగాల్లో ఎంతో మంది ఉద్యోగులను తీసేసింది. ఉద్యోగాల నుంచి తీసేసిన వారందరూ ఫిల్మ్స్, టీవీ, కార్పోరేట్ ఫైనాన్స్ విభాగాల్లో వర్క్ చేస్తున్న వాళ్లే. ఈ లే ఆఫ్స్ మూవీ మరియు టెలివిజన్ మార్కెటింగ్, క్యాస్టింగ్ సెలక్షన్, పబ్లిసిటీ మరియు అభివృద్ధి లాంటి వాటిపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి.
డిస్నీ తమ బిజినెస్ స్ట్రాటజీని పునరుద్ధరించుకోవడానికే ఈ లే ఆఫ్స్(Lay Offs) డెసిషన్ ను అమలు చేసినట్టు తెలుస్తోంది. చాలా మంది కేబుల్ సేవల నుంచి స్ట్రీమింగ్ సేవలకు షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో డిస్నీ కూడా దానికి అనుకూలంగానే బిజినెస్ చేయాలని ప్రయత్నిస్తూ అందులో భాగంగానే ఈ నిర్ణయాన్ని తీసుకుని అమలు చేసిందని తెలుస్తోంది.
ఆల్రెడీ 2023లో డిస్నీ 7000 మంది ఉద్యోగులను తొలగించి దాంతో 5.5 బిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించుకోగా రీసెంట్ గా మార్చిలో మరో 200 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఉద్యోగులను విధుల నుంచి తొలగించినప్పటికీ డిస్నీ మే ఆదాయ నివేదిక వాల్ స్ట్రీట్ అంచనాలను మించుతూనే ఉంది. మే తర్వాత డిస్నీ షేర్లు 21% పెరిగాయి. కానీ సోమవారం ఆ షేర్ల విలువ 112.95 డాలర్ల వద్ద కొద్దిగా తగ్గాయి.