వేణు రెండో సినిమాకు హీరో ఎవరు?
కమెడియన్ గా సినిమాలు చేస్తూ అందరికీ సుపరిచితుడైన వేణు జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులరయ్యాడు. ఈ షో తర్వాత వేణు సినిమాల్లోకి వచ్చి పెద్దగా సక్సెస్ అయింది లేదు. దీంతో స్వయంగా తనే ఓ కథను రెడీ చేసి దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ని ఒప్పించి, బలగం సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.
కామెడీ చేసే వేణు నుంచి ఎవరూ బలగం లాంటి సినిమాను ఆశించలేదు. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు దిల్ రాజు వేణుకు మరో ఛాన్స్ ఇచ్చాడన్న విషయం తెలిసిందే. బలగం కోసం వేణుకి తక్కువ బడ్జెట్ ఇచ్చిన దిల్ రాజు ఈ సారి వేణు కు తను అడిగినంత బడ్జెట్, కోరిన హీరోని ఇస్తానని దిల్ రాజు మాటిచ్చాడట.
దీంతో ఇప్పుడు వేణు ఫోకస్ టైర్ 2 హీరోల మీద పడింది. తన రెండో సినిమాను కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు వేణు. తాను రాసుకున్న కథ కోసం వేణు ఇద్దరిన హీరోలుగా అనుకుంటుండగా, అందులో ఓ మెగా హీరో కూడా ఉన్నాడని టాక్. మరి వేణు రాసుకున్న కథ ఈసారి కూడా మెప్పిస్తుందా? వేణు డైరెక్ట్ చేయబోయే సెకండ్ మూవీ హీరో ఎవరన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.













