పూరీ, వినాయక్‌ను ఫాలో అవుతున్న హరీష్ శంకర్
టాలీవుడ్ డైరెక్టర్లలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే డైరెక్టర్ ఎవరంటే వెంటనే చెప్పే పేరు హరీష్ శంకర్. సోషల్ మీడియాలోనే కాదు, టాలీవుడ్ లో జరిగే ఎన్నో మూవీ ఈవెంట్స్ లో కూడా హరీష్ శంకర్ కనిపిస్తుంటాడు. డైరెక్టర్ గా మంచి పొజిషన్ లో ఉండి కూడా ప్రతి సినిమా ఈవెంట్ కు ఎందుకొస్తాడని హరీష్ గురించి అందరూ కామెంట్స్ చేస్తుంటారు.
కొంతమందైతే హరీష్ శంకర్ ఇంత ఖాళీనా అని కూడా అన్నార. ఈ కామెంట్స్ కు హరీష్ శంకర్ రీసెంట్గా ఆన్సర్ ఇచ్చాడు. స్పార్క్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన హరీష్, నెట్టింట తనపై వేస్తున్న కామెంట్స్ పై మాట్లాడాడు. తను డైరెక్టర్ గా వస్తున్న టైమ్ లో పూరీ, వినాయక్ లాంటి పెద్ద డైరెక్టర్లు తనకు ప్రోత్సాహాన్నిచ్చారన్ని, తన సీనియర్స్ చేసినట్లే ఇప్పుడు తను కూడా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఈవెంట్ కు వెళ్తున్నట్లు చెప్పాడు.
కొత్త వాళ్లకు ప్రోత్సాహం అందించాలనే మంచి ఉద్దేశంతోనే ఎవరు అడిగినా కాదనకుండా సినిమా ఈవెంట్స్ కు వెళ్తుంటానని హరీష్ సమాధానమిచ్చాడు. తన కెరీర్ కు కొంతమంది హెల్ప్ చేసిన దాన్ని గుర్తు పెట్టుకుని, ఇప్పుడు తను కూడా ఇలా చేయడమనేది మెచ్చుకోదగ్గ విషయమే. హరీష్ మంచి మనసు తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయన గురించి ఇప్పుడు పాజిటివ్ ట్వీట్స్ వేస్తున్నారు.













