Dil Raju: దిల్ రాజు పాన్ ఇండియా లైనప్ మామూలుగా లేదుగా

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన దిల్ రాజు(Dil Raju) ఆ తర్వాత సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఆయన్నుంచి సినిమా వస్తుందంటే హిట్ మూవీ వస్తుందని అందరూ అనుకుంటారు. అలాంటి ఆయన గత కొన్నాళ్లుగా చెప్పుకోదగ్గ ఫామ్ లో లేరు.
రీసెంట్ టైమ్స్ లో ఆయన్నుంచి సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) అనే సినిమా తప్ప మరో పెద్ద హిట్ లేదు. కానీ రీసెంట్ గా ఓజి(OG) సినిమా డిస్ట్రిబ్యూషన్ తో భారీ సక్సెస్ ను అందుకున్న దిల్ రాజు ఇప్పుడు ఆ సక్సెస్ ఇచ్చిన ఎనర్జీతో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. అయితే ఈసారి దిల్ రాజు కేవలం తెలుగు హీరోలతోనే కాకుండా వివిధ ఇండస్ట్రీల హీరోలతో సినిమాలు చేయనున్నారు.
అందులో భాగంగానే తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) తో పాటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) తో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్న దిల్ రాజు, కోలీవుడ్ లో అజిత్(ajith) తో ఓ సినిమా తీయాలని అనుకుంటున్నారట. అలాగే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్(Akshay kumar) తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను రీమేక్ చేయాలని, సల్మాన్ ఖాన్(salman khan) తో మరో ప్రాజెక్టును లైన్ లో పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారట. ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టి దిల్ రాజు రిస్క్ చేస్తున్నారేమో అని కొందరంటుంటే, ఇన్నాళ్లకు మళ్లీ దిల్ రాజు మంచి ఫామ్ లోకి వచ్చారని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.