యానిమల్ ను ముందే అంచనా వేసిన దిల్ రాజు
మరో 5 రోజుల్లో రిలీజ్ కాబోతున్న యానిమల్ సినిమా పై హైప్ క్రమంగా పెరిగిపోతుంది. ట్రైలర్ తో యానిమల్ సినిమా అంచనాలను ఒక్కసారిగా పెంచడంతో టికెట్స్ కోసం మామూలు డిమాండ్ లేదు. 3.21 గంటల రన్ టైమ్ అని ఫస్ట్ లో నెగిటివ్ గా అన్నప్పటికీ, ఇప్పుడు సందీప్ రెడ్డి కోసం ఎంతసేపైనా థియేటర్లోనే ఉంటామని ఫ్యాన్స్ అంటున్నారు.
సినిమాకు హైప్ బాగా పెరగడంతో క్రేజ్ ఉన్న మల్టీప్లెక్సులో టికెట్స్ పెట్టడం లేట్ వెంటనే ఆరెంజ్ మార్క్ పడిపోతుంది. యానిమల్ మూవీ తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను దిల్ రాజు రూ.15 కోట్ల మొత్తానికి డీల్ సెట్ చేసుకున్నాడని సమాచారం. మామూలుగా అయితే రణ్‌బీర్ మూవీకి ఈ అమౌంట్ చాలా ఎక్కువ. కానీ ఇక్కడ సందీప్ రెడ్డి ఉండటంతో ఆ రేటు పెట్టొచ్చనిపిస్తోంది.
అన్ని లెక్కలేసుకునే దిల్ రాజు ఆ రేటుకు యానిమల్ రైట్స్ ను కొనుగోలు చేశాడట. డిసెంబర్ 1కు ముందు రోజు రాత్రే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లు వేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. యానిమల్ కు యావరేజ్ టాక్ వచ్చినా సరే కనీసం వారం రోజులు ఫుల్స్ పడతాయి. దానికి తోడు దాదాపు నెల నుంచి సరైన సినిమా లేక ఆకలి మీదున్న ఆడియన్స్ కు యానిమల్ హిట్ అయితే మాత్రం ఆ సినిమాను ఆపడం ఇప్పట్లో ఎవరితరం కాదు.













