ఫ్యామిలీ స్టార్‌కు దిల్ రాజు ప్లాన్
ఏప్రిల్ 5 రూపంలో మంచి రిలీజ్ డేట్ ను అందుకుంది విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా. రిలీజ్ కు ఇంకో 42 రోజులు మాత్రమే టైముంది. ఇంకా కొంత కీలక భాగం షూటింగ్ పెండింగ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను వచ్చే నెల రెండో వారానికి షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు మేకర్స్. లేదంటే ప్రమోషన్స్ కు సరిపడా టైమ్ దొరకదు.
దీంతో తప్పేది లేక రిలీజ్ డేట్ ను టార్గెట్ గా పెట్టుకుని పరశురామ్ సినిమా షూటింగ్ ను ఆఘమేఘాల మీద చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లిరికల్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మిగిలిన సాంగ్స్ ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఆడియన్స్ లో ఎక్కువైపోయింది. మంచి కథ, పాటలు ఉంటే ఆడియన్స్ కు థియేటర్లకు ఈజీగా రప్పించగలడు విజయ్ దేవరకొండ.
అందుకే ఈ సినిమాను అన్ని విధాల ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలని దిల్ రాజు ప్రమోషన్స్ ను చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట. అసలే ఫ్యామిలీ స్టార్ కు వారం ముందు ఎంతో క్రేజ్ మధ్య టిల్లూ స్వ్కేర్ సినిమా రిలీజ్ అవుతుంది. దానికి పాజిటివ్ టాక్ వస్తే జనాలు ఫ్యామిలీ స్టార్ వైపు చూడటం కష్టమవుతుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఫ్యామిలీ స్టార్ ను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా సినిమాపై ఉన్న బజ్ పెరుగుతుందని టీమ్ చాలా నమ్మకంగా ఉంది.













