Dil Raju: సల్మాన్ ఖాన్ తో దిల్ రాజు సినిమా

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన దిల్ రాజు(Dil Raju) తర్వాత నిర్మాతగా మారి సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు తన ఫోకస్ ను మొత్తం బాలీవుడ్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మధ్య దిల్ రాజుకు ఎక్కువగా సక్సెస్ దక్కడం లేదు. వరుస ఫ్లాపుల తర్వాత ఓ భారీ ప్రాజెక్టుతో కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు.
అందులో భాగంగానే బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో సినిమాను ప్లాన్ చేశాడు దిల్ రాజు. కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా ఓ సినిమా చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి(Vamsi Paidipally) దర్శకత్వం వహించనున్నారని కూడా టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
వంశీ చెప్పిన ఓ కథకు సల్మాన్ ఖాన్(Salman Khan) సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆయన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం మిగిలిన విషయాలు, అగ్రిమెంట్స్ పై దిల్ రాజు టీమ్ తో సల్మాన్ డిస్కషన్స్ చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. ఈ డిస్కషన్స్ సజావుగా సాగితే త్వరలోనే ఈ భారీ సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని తెలుస్తోంది.