Dil Raju: ఆ ప్రాజెక్టును కన్ఫర్మ్ చేసిన దిల్ రాజు

పుష్ప(Pushpa) ఫ్రాంచైజ్ సినిమాలతో అల్లు అర్జున్(Allu Arjun) రేంజ్ చాలానే మారింది. అప్పటివరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్‌ను పుష్ప ఫ్రాంచైజ్ ఐకాన్ స్టార్(Icon Star) ను చేసింది. ఈ రెండు సినిమాలతో బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో ఓ రేంజ్ గుర్తింపును తెచ్చుకున్నాడు. పుష్ప2(Pushpa2) తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో ఎవరూ ఊహించని విధంగా అట్లీ(Atlee)తో సినిమాను అనౌన్స్ చేశాడు బన్నీ.
అనౌన్స్‌మెంట్ తోనే ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ సినిమా తర్వాత బన్నీ(Bunny) మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు చేయనుండగా అందులో కేజిఎఫ్(KGF), సలార్(Salaar) ఫేమ్ ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉందని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. దిల్ రాజు(Dil Raju) బ్యానర్ లో అల్లు అర్జున్- ప్రశాంత్ నీల్ కలయికలో రావణం(Ravanam) అనే సినిమా వస్తుందని టాక్ వినిపిస్తుంది.
అయితే ఇన్నాళ్ల నుంచి కేవలం రూమర్ గా ఉన్న ఈ వార్తను నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా కన్ఫర్మ్ చేశారు. తమ కాంబినేషన్ లో రావణం అనే సినిమా పై వస్తున్న వార్తలు నిజమేనని చెప్పడంతో బన్నీ లైనప్ లో మరో క్రేజీ కాంబినేషన్ కూడా ఉందని కన్ఫర్మ్ అయింది. నితిన్(Nithin) హీరోగా తెరకెక్కిన తమ్ముడు(Thammudu) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు ఈ ప్రాజెక్టు గురించి వెల్లడించారు.