Keerthy Suresh: పెళ్లి తర్వాత కీర్తి కెరీర్ స్లో అయిందా?
కీర్తి సురేష్(keerthy Suresh). అమ్మడికి సౌత్‌లో ఉన్న ఫాలోయింగ్, క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేను శైలజ(nenu sailaja) సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన కీర్తి(keerthy) మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు అందుకుని మహానటి తో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది.
అలాంటి కీర్తి కెరీర్ పెళ్లి తర్వాత నెమ్మదించింది. 2024 డిసెంబర్ లో తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ(anthony)ని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్, పెళ్లి తర్వాత తన యాక్టింగ్ కెరీర్ ను మరింతగా పరుగులు పెట్టించేలా ప్లాన్ చేసిందనుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ కీర్తి మునుపటి కంటే స్పీడుగా ఉందని అనుకునేలా చేసింది.
కానీ పెళ్లై 9 నెలలవుతున్నా కీర్తి ఒక్క తెలుగు ప్రాజెక్టుకు కూడా సైన్ చేసింది లేదు. వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో సూర్య(Suriya) హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కీర్తిని తీసుకోవాలని అప్పట్లో డిస్కషన్స్ జరిగినట్టు వార్తలు కూడా వచ్చాయి, ఆ తర్వాత నితిన్(Nithin) తో ఎల్లమ్మ(Yellamma) కోసం సంప్రదించారన్నారు. కానీ ఆ రెండింటిలో ఏ అవకాశాన్నీ కీర్తి అందుకలేకపోయింది. మరి కీర్తి తన కొత్త ప్రాజెక్టును ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి.







