జాన్వీ అందుకు ఒప్పుకుంటుందా?
జూ. ఎన్టీఆర్ తో దేవర సినిమా ద్వారా టాలీవుడ్ కు గ్రాండ్ ఇవ్వడానికి జాన్వీ కపూర్ ఇప్పటికే రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే జాన్వీకి తెలుగులో రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా జాన్వీ తండ్రి బోనీ కపూర్ చెప్పాడు. కానీ జాన్వీ మాత్రం ఈ విషయాన్ని ఇంకా బయటకు చెప్పలేదు.
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ను పుష్ప 2లో ఓ స్పెషల్ సాంగ్ కోసం డైరెక్టర్ సుకుమార్ సంప్రదించినట్లు నెట్టింట తెగ ప్రచారమవుతుంది. పుష్ప 2లో ఊ అంటావా ఊహూ అంటావా సాంగ్ ని మించేలా దేవీ శ్రీ ఓ సాంగ్ ను రెడీ చేశాడని ఆ సాంగ్ కోసం సుకుమార్, జాన్వీని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాట చేయడానికి జాన్వీ ఒప్పుకుంటుందా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న.
ఎందుకంటే ఈ స్పెషల్ సాంగ్ చేస్తే జాన్వీ కపూర్ టాలీవుడ్ కు తొలి పరిచయం అనే కార్డ్ ను పుష్ప2లోనే వేయాల్సి ఉంటుంది. అంటే జాన్వీ టాలీవుడ్ కు ఓ స్పెషల్ సాంగ్ ద్వారా పరిచయమైందనే మాట ఎప్పటికీ వినాల్సి ఉంటుంది. దీనికి బోనీ కపూర్ ఒప్పుకుంటాడా అన్నది అనుమానం. ఒకవేళ ఒప్పుకుని జాన్వీ చేస్తే మాత్రం అందరికీ ఇది స్పెషల్ అవుతుంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం మొదట దిశా పటానీని అనుకుని ఆమెను అడగ్గా, కాల్షీట్స్ ప్రాబ్లమ్ వల్ల ఓకే కాలేదని సమాచారం. ఈ సాంగ్ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, పుష్ప2 నుంచి ఫస్ట్ లిరికల్ గా దీన్నే రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు టాక్. కాగా పుష్ప2 ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













