మోక్షజ్ఞ మూవీలో ఆ యంగ్ హీరో విలనా?
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కొడుకు మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja) హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. హను మాన్(Hanu Man) డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ లాంచ్ కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు కూడా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే విలన్ గురించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో హీరోల పాత్రలు ఎంత బలంగా ఉంటాయో విలన్ పాత్రలు కూడా అంతే పవర్ఫుల్ గా ఉండేలా ప్రశాంత్ వర్మ డిజైన్ చేస్తాడు. అందుకే మోక్షజ్ఞ సినిమా కోసం విలన్ పాత్రకు ఓ పాపులర్ యాక్టర్ ను తీసుకోవాలని చూస్తున్నాడట ప్రశాంత్ వర్మ.
ఇందులో భాగంగానే తమిళ యంగ్ హీరో ధృవ్ విక్రమ్(Dhruv Vikram) ను విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు టాక్. అర్జున్ రెడ్డి(Arjun Reddy) తమిళ రీమేక్ ఆదిత్య వర్మ(Aditya Varma) సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటరైన ధృవ్ తర్వాత విక్రమ్(vikram) తో కలిసి మహాన్ చేశాడు. అందులో ధృవ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఈ రెండు సినిమాలూ తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం హీరోగా చేస్తున్న టైమ్ లో ధృవ్ ఇక్కడ విలన్ గా నటిస్తాడా లేదా అన్నది చూడాలి. సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి చేసే అవకాశాలు లేకపోలేదు. చూద్దాం ధృవ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.













